రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం అనివార్యమని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మద్దతుదారులందరూ ఈ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతున్న సందర్భంగా సభ్యులందరికి వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు.