పార్టీని వీడడానికి ముందే కాంగ్రెస్ తనకు మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు బిజేపి ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే దానిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కమల్నాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.