కర్ణాటకలో అక్టోబర్ నెలలో డిగ్రీ కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ ప్రకటించారు. డిగ్రీ విద్యార్థుల కోసం పూర్తి సమయం ఆన్లైన్ తరగతులు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతామని అశ్వత్ నారాయణ్ ప్రకటించారు. కళాశాలలను తిరిగి తెరవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తోందని మంత్రి చెప్పారు.