దాద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్కార్ట్స్ కాలనీలో నివసిస్తున్న 65 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బచ్చన్ సింగ్ మద్యం మత్తులో కొడుకుని రెండు సార్లు తుపాకీతో కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. తదనంతరం తనని తానే కాల్చుకొని చనిపోయాడు. గాయపడ్డ కొడుకు పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.