సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ను పుణెకు చెందిన భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుప్రతిలో పనిచేసే ఇద్దరు వలంటీర్లకు మొదటి డోసు వేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం, శరీర పనితీరు బాగానే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. నెలరోజుల తర్వాత వారికి మరో డోసు ఇస్తామని తెలిపారు.