దగా పడిన దళిత జాతి దండు కట్టాలి.. దండెత్తాలి.. పేరుతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ పుస్తకం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై జరిగిన దాడి సంఘటనలన్నిటినీ ఒకేచోట చేర్చి వాటిని హైలెట్ చేస్తూ ఈ పుస్తకం విడుదల చేశారు. అయితే ఈ పుస్తకంపై వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. దళిద ద్రోహి చంద్రబాబేనంటూ మండిపడ్డారు ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు. చంద్రబాబు దళితులపై 40ఏళ్లుగా పగ పెంచుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.