సీఎం జగన్ తీసుకున్న మరో నిర్ణయంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా పరీక్షల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ఎక్కువ మంది టెస్ట్ లు చేయించుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టెస్ట్ లు ఎక్కువ అయితే అదే సమయంలో పాజిటివ్ ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్తానంటోంది.