నారా లోకేష్ ఇప్పుడు మరో ఛాలెంజ్ స్వీకరిస్తానంటున్నారు. టీడీపీ భావి నాయకుడికోసం పార్టీలో సీక్రెట్ ఓటింగ్ పెడితే ఏ ఒక్కరూ లోకేష్ కి ఓటు వేయరనేది పంచకర్ల వాదన. అందరిపై లోకేష్ ని రుద్దడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో లోకేష్ సీక్రెట్ ఓటింగ్ కి నేను రెడీ అని అంటున్నారట.