పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆసుపత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.14 రోజుల క్రితం కరోనాతో ఆశ్రం ఆసుపత్రిలో చేరిన నిడదవోలు మండలానికి చెందిన యువకుడు... వైద్యం సరిగ్గా చేయడం లేదని తీవ్ర మనస్తాపం చెంది ఆసుపత్రి పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.