తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.అంతేకాకుండా కేవలం ప్రభుత్వ బుల్లెట్‌ప్రూఫ్ కారులో వెళ్లాలని ఎమ్మెల్యేకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సూచించారు. భద్రత పెంపు అంశంపై స్పందించిన రాజా సింగ్... తనకు ఎవరి నుంచి ప్రాణాహాని ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవిషయంపై కేంద్ర, రాష్ట్ర హోంశాఖ మంత్రులకు లేఖ రాస్తానని రాజాసింగ్ తెలిపారు.