ఏపీ రాజధాని తరలింపు వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించింది. హైకోర్టులో ఉన్న వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలుకు పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చింది. రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ, ముఖ్య నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.