రాజస్థాన్ రాష్ట్రంలోని జోధాపూర్ జిల్లాలో రాజీవ్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆరుగురు యువకులు గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. శనివారం రోజు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.