కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లికి చెందిన గొల్లపల్లి నవీన్ బాబు తన పాపకి జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని తీసుకెళ్లి రూ.1.50 లక్షలకు విక్రయించాడు. అయితే పాప ఎక్కడుందని భార్య రజిని ప్రశ్నించగా నవీన్ బాబు తన తల్లిదండ్రులతో కలిసి పురుగుల మందు నోట్లో పోసి రజినిని చంపబోయాడు. వారినుంచి తప్పించుకున్న రజిని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ ను కలవగా... విక్రయించబడిన పాపను ఆమెకి తిరిగి ఇప్పించారు.