వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పదే పదే కేంద్రానికి చేసిన విజ్ఞప్తులు ఫలించడంతో... కదలిక వచ్చిందని తెలిపారు. త్వరలోనే విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని, రన్ వేను మంత్రి పరిశీలించారు.