శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.