సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యానికి రైతు బలయ్యాడు. 15 ఏళ్ల క్రితం కొన్న భూమికి పట్టా ఇవ్వకపోవడం, భూమి విక్రయించిన గడ్డం రాంరెడ్డి పంట నష్టం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ఆవేదనతో మల్లయ్య మృతి చెందినట్టు తెలుస్తోంది. రైతు మృతదేహంతో గడ్డం రాంరెడ్డి ఇంటి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.