భారత్లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కేవలం ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20లక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే నెల సమయంలో ఈ రేంజ్ లో కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదుకాలేదు. వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న అమెరికాలో ఒక నెలలో అత్యధికంగా 19లక్షల 4వేల కేసులు మాత్రమే నమోదవ్వగా.. భారత్లో ఆగస్టు నెలలోనే 19లక్షల 50వేల కేసులు నమోదయ్యాయి. కాగా మరణాలు మాత్రం అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి.