అనంతపురం జిల్లా రాయదుర్గం మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో పట్టపగలే దోపిడీ జరిగడం కలకలం రేపింది. ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి క్యాష్ కౌంటర్లోని నగదును దొంగిలించారు. బంగారం తాకట్టు పెడతామని చెప్పిన దుండగులు అసిస్టెంట్ మేనేజర్ తలపై తుపాకీ పెట్టి బెదిరించి చోరీకి పాల్పడ్డారు.