జీఎస్టీ పరిహారం చెల్లింపు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో రాష్ట్ర ఆదాయం 83శాతం పడిపోయిందని లేఖలో పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపిన కేసీఆర్... కరోనాపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థికంగా చేయూత అందివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.