వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో కీలక మార్పులు జరిగాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యుత్ ఉచిత రాయితీ మొత్తాన్ని రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. విద్యుత్ బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.