ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. మీడియా ప్రతినిధులపై వరుస దాడులు, ఎస్సీల అనుమానాస్పద మరణాలు, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జర్నలిస్ట్ వెంకట నారాయణపై దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు.