గత నెల 30న.. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను భారత సైన్యం గుర్తించింది. యుద్ధ సామాగ్రిని దుండగులు పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమంగా తరలిస్తున్నట్టు సైన్యం అనుమానించి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆయుధాలను తాజాగా స్వాధీనం చేసుకుంది.