సోషల్ మీడియాలో టీడీపీ హవా బాగా కనిపించే రోజులు ఇప్పుడు పోయాయని, అందుకే పార్టీ అధినేతకు సంబంధించిన ముఖ్యమైన రోజుని కూడా సరిగా జరుపుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం లోకేష్ నుంచి కూడా ఓ ట్వీట్ పడలేదు. దీంతో మిగతా నేతలు, టీడీపీ అభిమానులు కూడా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నారు. 1995సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2020కి సరిగ్గా పాతికేళ్లు. ఈ విషయంలో టీడీపీకంటే వైసీపీయే ఓ మెట్టు పైన ఉందని అర్థమవుతోంది. వెన్నుపోటుకి పాతికేళ్లు అంటూ వైసీపీ చేసిన ప్రచారం జనంలోకి బాగా చొచ్చుకుని పోయింది.