ఇంటినుంచి బయలుదేరిన తర్వాత హెలికాప్టర్ ఎక్కేముందు వైఎస్ఆర్, మీడియాతో చివరిసారిగా మాట్లాడారు. అప్పుడు టీవీలో ఆయన్ని చివరిసారిగా చూశారు విజయమ్మ. ఎప్పుడూ లేనిది ఆయన హెలికాప్టర్ ఎక్కేముందు సిబ్బందితో ఫొటోలు దిగడం కూడా యాదృచ్ఛికమేనంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి హెలికాప్టర్ ఎక్కినప్పుడు, బయలుదేరేటప్పుడు సీరియస్ గా కనిపించారని ఆ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఫొటోలు చూసినప్పుడల్లా అదే విషయం గుర్తుకొస్తుందని చెబుతారు విజయమ్మ.