ఎప్పుడెప్పుడా అని పవర్ స్టార్ అభిమానులంతా ఎదురు చూసిన వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రానే వచ్చింది. పవర్ స్టార్ పవర్ ఫుల్ లుక్ తో మోషన్ పోస్టర్ అదిరిపోయింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పోస్టర్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. పూర్తిగా లాయర్ డ్రెస్ లో ఓ చేతిలో క్రిమినల్ లా బుక్, మరో చేతిలో స్టిక్ చేతబట్టుకుని విలన్ల భరతం పట్టేలా కనిపిస్తున్నాడు పవర్ స్టార్.