మద్యానికి బానిసైన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. దివ్యాంగురాలైన భార్యకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులను తన తాగుడు కోసం ఇవ్వాలని వేధించాడు. కాని దీనికి భార్య నిరాకరించడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.