కుటుంబ పోషణ భారమై ప్రకాశం జిల్లా వలేటివారిపాలేనికి చెందిన దంపతులు తమ కూతురుని యుగేందర్ నాగమణి దంపతుల వద్ద పనికి కుదుర్చగా వారు బాలికను ఢిల్లీ తీసుకెళ్లారు. ఇక అక్కడ యుగేందర్ బాలికపై కన్నేసి పలుమార్లు బెదిరించి అత్యాచారం చేయగా భార్య దీనికి సహకరించింది. ఇక ఇటీవలే బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.