తనను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు అంటూ పోలీసులను ఆశ్రయించింది మహిళా. ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. రాజేష్ 55 లక్షలు, సింహాచలం 15 లక్షలు తీసుకొని నెల తరువాత రెట్టింపు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటూ రాయ దుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రంగమ్మ అనే నర్సు.