కరోనా కాలంలో హైదరాబాద్ లో ఉంటున్న చంద్రబాబు ఇన్నాళ్లూ జూమ్ యాప్ ద్వారానే తన సందేశాలను వినిపిస్తూ వచ్చారు. ప్రజలతో మాట్లాడాలన్నా, పార్టీ నేతలతో సమావేశం కావాలన్నా.. అన్నిటికీ జూమ్ నే వాడేవారు. అయితే ఆ జూమ్ తో జనం విసిగిపోయారు, అటు కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొంది. జనంలో లేకపోతే నాయకుడి ప్రభ క్రమక్రమంగా తగ్గిపోతుంది. అందుకే ఇన్నాళ్లూ హైదరాబాద్ లోనే ఉన్న బాబు.. ఇప్పుడు జూమ్ కి గుడ్ బై చెప్పాలనుకున్నారు.