అన్లాక్ 4.0 భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనపు ప్రత్యేక రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించింది. దీనికోసం ఆయా రైల్వే బోర్డులకే అధికారాన్ని అప్పజెప్పింది. కాగా దక్షిణ మధ్య రైల్వే మరో 15 రైళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి.. న్యూఢిల్లీ, తిరుపతి , పాట్నా, హౌరా , బెంగళూరుకు అదనపు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.