సుశాంత్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. ఇటీవలే డ్రగ్స్ సప్లై చేసే ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా వారిలో ఒకరికి సుశాంత్ మేనేజర్ శ్యామ్యూల్ మిరిండా తో సంబంధం ఉన్నట్లు తేలింది. కాగా సుశాంత్ మేనేజర్ ని నియమించింది రియా చక్రవర్తి కావడం గమనార్హం. దీంతో రియా చక్రవర్తి మరింత ఇరకాటంలో పడింది.