కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ లాగానే మరో రెండు బ్యారేజ్‌లు నిర్మాణం చేసేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారు. బాపట్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, పల్నాడు ప్రాంతంలో గొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.