రాజధానికోసం పోరాటం చేస్తున్న అమరావతి రైతులు తమకు అన్యాయం చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే తాజాగా వారికోపం టీడీపీ పైకి కూడా మళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన చంద్రబాబు కనీసం తమను పరామర్శించేందుకు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. సొంత పార్టీ నేతలను పరామర్శించిన బాబుకి, తమని పలకరించే తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు. అమరావతి పోరాటానికి అండగా నిలబడకపోతే.. చంద్రబాబుని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇస్తున్నారు.