ఇప్పటి వరకూ తన ట్వీట్లతో ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే నారా లోకేష్ సడన్ గా కాలమిస్ట్ అవతారం ఎత్తారు. ఓ వార్తా పత్రికకు ఎడిటోరియల్ రాసుకొచ్చారు. దళితులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని, వారిపై దాడులు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో రాష్ట్రంలో దళితులు సంతోషంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెడుతోందని అన్నారు. నారా లోకేష్ రాసిన ఎడిటోరియల్ కి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. చినబాబు చించేశారు, అదరగొట్టేశారంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ హోరెత్తించింది.