ఆమంచికి మద్దతుగా కొంతమంది నేతలు.. తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో అటు కరణం బలరాం, పోతుల సునీత వర్గం కూడా పోటీగా ఆమంచిపై ఫిర్యాదులు చేసింది. దీంతో ఇరువర్గాలతో చర్చించాలంటూ అధిష్టానం జిల్లా మంత్రి బాలినేనికి సూచించినట్టు సమాచారం. గతంలో కూడా బాలినేని వద్దకు ఈ పంచాయితీ వచ్చినా ఆయన వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా జరిగిన సంఘటనతో నేరుగా ఫిర్యాదులు అధిష్టానం వద్దకు వెళ్లాయి.