కొడాలి నాని గల్లీ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు దేవినేని ఉమా. లారీ డ్రైవర్, లారీ క్లీనర్ అంటూ తనని విమర్శిస్తున్న ఉమాని.. ఏదో ఒకరోజు విసుగొచ్చి లారీ డ్రైవర్లే అతనిపైనుంచి లారీ పోనిస్తారంటూ మంత్రి అన్న మాటలకు తీవ్రంగా స్పందించారు ఉమా. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మీ అసమర్థత, అవినీతి కప్పి పుచ్చుకోడానికి ఇలా మాట్లాడతారా. ప్రతిపక్ష నేతల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు.