రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రైతులంతా ఇకపై ఉచిత విద్యుత్ అందదేమోననే భయంలో ఉన్నారు. దానికితోడు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నాయి. రైతుల్ని రెచ్చగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పదే పదే ఉచిత విద్యుత్ గురించి ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.