కొవిడ్ కేర్ సెంటర్లకు రేటింగ్ ఇచ్చి ర్యాంకులు కేటాయించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ర్యాంకుల ఆధారంగా వాటి పనితీరు మదింపు చేయాలని, రోగుల వద్ద అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు భయాందోళనలకు గురవుతున్నాయి. ర్యాంకులు ఇచ్చి తమకు రేటింగ్ కట్ చేస్తే కొవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేస్తారేమోనని భయపడుతున్నాయి యాజమాన్యాలు.