ఉదయం తీసుకెళ్లిన నిర్మల 20 నిమిషాల తరువాత కంగారుగా పరిగెత్తుకు వచ్చి పాప కనిపించడం లేదని చెప్పింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతికారు. ఈ సమయంలో తమ ఇంటి పై ఉన్న నీళ్ల ట్యాంకు లో హేమ పడివుందని నిర్మల చెప్పింది. వెంటనే కొన ఊపిరి తో ఉన్న హేమని బయటకు తీసి సోంపేట సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం ఏమి లేదు. ప్రాణాలు విడిచింది హేమ. బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.