శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది అగ్ని ప్రమాదానికి బలైన ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఇటీవల వరకూ నిందలు పడ్డాయి. కేవలం 25లక్షల పరిహారంతోనే సరిపెట్టారంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వం తరపున ఇచ్చే పాతిక లక్షల పరిహారానికి తోడు, ఏపీ జెన్ కో 75లక్షల నష్టపరిహారం ఇస్తామని ముందుకొచ్చింది. దీంతో బాధిత కుటుంబాలకు అందే మొత్తం కోటి రూపాయలకు చేరింది.