కరోనా బాధితులు ఆస్పత్రులనుంచి కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఏపీ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఆగిపోయింది. కోలుకున్నవారికి 2వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆపేసింది. ఖర్చు పెరిగిపోవడంతో ఆర్థిక సాయం ఆగిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.