శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా సుమారు ఒంటి గంట సమయంలో ఈ చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది ఈ రధాన్ని షెడ్డులో భద్రపరిచారు. ఆ షెడ్డు లో ఉన్న పురాతన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయ్యిపోయింది. అయితే ఈ ఘటన జరగడానికి కారణం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశం పై పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.