చంద్రబాబుతో పోటీ పడుతూ ఆయన తనయుడు నారా లోకేష్ కూడా పచ్చి అబద్దాలాడుతున్నారని, ఆ విషయంలో లోకేష్ తండ్రిని మించిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. 70ఏళ్ల చంద్రబాబుకంటే.. 35ఏళ్ల లోకేష్ అబద్ధాలు చెప్పడంలో రాటుదేలారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని ప్రచారం చేస్తున్న లోకేష్ అవి గత సంవత్సరం లెక్కలని తెలుసుకోవాలని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ వచ్చాకే రైతుల కష్టాలు ఒక్కొక్కటీ తీరుతున్నాయని వివరించారు.