ఈనెల 21న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకు నోటిఫికేషన్ వచ్చిందంటూ కొందరు సోషల్ మీడియాలో చేసిన ప్రచారంపై ఈసీ స్పందించింది. తాము ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని ప్రకటించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయ పడింది.