ఏపీలో 29,783 రేషన్ షాపులు ఉన్నాయి. వీరిలో 1,188 మంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు. కొందరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టి రిమాండ్కు పంపారు. తనిఖీల నేపథ్యంలో కొందరు డీలర్లు సెలవుపై వెళ్తున్నారు. రాష్ట్రంలో 4,700 మంది డీలర్లు రేషన్ షాపులను సరిగా తెరవడం లేదని అధికారులు గుర్తించారు. వేళలు పాటించని డీలర్లను గుర్తించి పని తీరును మార్చుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు.