జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధూళిపాళ్ళ నరేంద్ర మళ్ళీ లైన్లోకి వచ్చేశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని చెప్పి తన వాయిస్‌ని బలంగా వినిపిస్తున్నారు. పైగా అమరావతి పక్కనే ఉండటం వల్ల ధూళిపాళ్ళకు బాగా కలిసొచ్చింది. ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉండటంతో, ధూళిపాళ్ళకు బాగా ప్లస్ అవుతుంది.