పేద ప్రజలు ఉండేందుకు వీలు లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీళ్లేదని, ముఖ్యమంత్రిని కలసి తాను ఈ విషయాన్ని చెప్పానని మంత్రి కొడాలినాని అన్నట్టు ప్రముఖ పత్రికల్లో వార్తలొచ్చాయి. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని కూడా మంత్రి అన్నారట. అదే జరిగితే అసెంబ్లీ కూడా అమరావతినుంచి తరలిపోవడం ఖాయం. శాసన రాజధానిగా కూడా అమరావతి లేకపోతే.. మరి మూడో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కొడాలి మాటలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.