ఏపీలో కొత్త జిల్లాల పేరుతో తకరాలు మొదలవుతోంది. కొత్త జిల్లాలపై అనేక ప్రతిపాదనలు స్థానికులనుంచి అధికారుల వద్దకు చేరుతున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గం అనే బౌండరీ పెట్టుకోకపోతే, అధికారులు ఎవరికి వారు బౌండరీలు మార్చుకుంటూ పోతే.. స్థానికుల్లో అసంతృప్తి చెలరేగడం ఖాయం. అంటే అనవసరంగా జిల్లాల పునర్విభజన పేరుతో తేనెతుట్టెను కదిపినట్టు అవుతుంది.