వ్యవసాయ ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో దశలవారీగా ఉద్యమం చేపట్టాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘాల ఉమ్మడి సమావేశం తీర్మానించింది. ఈనెల 9న ఆన్ లైన్ ద్వారా సభ నిర్వహించాలనుకుంటున్నారు రైతు సంఘం నాయకులు. ఈనెల 14న విద్యుత్ ఉప కేంద్రాల ముందు నిరసన చేపట్టాలని కూడా నాయకులు తీర్మానించారు. 15వతేదీన రైతు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ సిద్ధం చేస్తామంటున్నారు రైతు నాయకులు.