పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సెక్యులరిస్ట్ లు. హిందూమతంపై జరిగిన దాడిగా అంతర్వేది ఘటనను పవన్ అభివర్ణించడాన్ని విమర్శిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలు, దళితులపై జరిగిన దాడులు పవన్ కి కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు. రథం కాలిపోయిన ఘటనపై పవన్ కల్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు.